– 8లో
– 8లో
ఏర్పేడుకు చెందిన వైఎస్సార్‌సీపీ యువనాయకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
హామీలే గానీ అమలెప్పుడు బాబు?
తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను వంచించి మోసగించిన ద్రోహి, దుర్మార్గుడు చంద్రబాబు. తండ్రి అబద్ధపు హామీలతో ప్రజలను, యువతను మోసం చేస్తే.. డీఎస్సీ పేరుతో అర్హులకు పంగనామం పెట్టి ఒడ్కీ ఉద్యోగాన్ని రూ.30 లక్షల చొప్పున అనర్హులకు కట్టబెట్టిన ఘనుడు చంద్రబాబు తనయుడు లోకేష్. పారదర్శకంగా ఒకరికి ఒక్క ఉద్యోగమైన ఇచ్చానని చెప్పుకోగలవా?. ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా రాతపరీక్షలు నిర్వహించి 1.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్.జగన్‌ది. డీఎస్సీ అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రి లోకేష్‌పై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామ చేయాలి. – భూమన కరుణాకరరెడ్డి,
వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు
కూటమికి తోలుమందమెక్కువ
కూటమి ప్రభుత్వ తోలుమందాన్ని తగ్గించేలా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ తరఫున పోరాటం ఉధృతం చేస్తున్నాం. నిజాలు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు గుండాల మాదిరిగా పోలీసులను అడ్డుపెట్టుకుని శిబిరాల వద్ద దౌర్జన్యాలు చేయడం సిగ్గుచేటు. టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి రావాలి. – కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి
న్యాయం జరిగే వరకు పోరాటం
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేటతెల్లం అవుతున్నా ప్రభుత్వం స్పందించకుండా పోవడం సిగ్గుచేటు. చంద్రబాబు, లోకేష్ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. యువతను మోసం చేసిన లోకేష్ మీద సీబీఐ విచారణకు వేయాలి. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చినా ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు.
–మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ


