రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

రాపూరు: రాపూరు – చిట్వేలి మార్గంలోని ఘాట్‌రోడ్డులో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. రాపూరు మండలం గరిమెనపెంటకు ప్రసాద్‌(36), వెంగయ్య చిట్వేలి మండలం రాజరెడ్డిపాడు నుంచి మోటారు సైకిల్‌పై టీవీ తీసుకుని వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రసాద్‌ అక్కడికక్కడే మరణించాడు. క్షతగాత్రుడిని 108లో రాపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి జైలు

భాకరాపేట: వరకట్న వేధింపుల కేసులో నిందితుడు రంబే రాము అలియాస్‌ రామ్‌కుమార్‌కు చిత్తూరు ఐదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం రంగన్న గారి గడ్డకు చెందిన ముద్దాయిని ఈ మేరకు పోలీసులు జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement