తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) చంద్రశేఖర్‌గుప్త పరిశీలించారు. దాదాపు పూర్తయిన దక్షిణం వైపు భవన సముదాయంతో పాటు రన్నింగ్ రూం, టీటీల విశ్రాంతి గదులు, సీడీవో ఆఫీసు, ఉత్తరం వైపు నిర్మాణ భవనాలను పరిశీలించారు. సంబంధిత ఇంజినీరింగ్ విభా గం అధికారులు, రైల్వే అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. డీఆర్‌ఎంతో కలసి నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పలు అంశాలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ కళాశాల ఎదురుగా రైల్వే అండర్ పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి రైల్వేష్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయ ణ, మేనేజర్ చిన్నపరెడ్డి, డీప్యూటీ ఈఈ వామణమూర్తి, సీనియర్ డీవోఎం దినేష్‌కుమార్ పాల్గొన్నారు.


