రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

తడ: జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సూళ్లూరుపేట మండలం, ఇలుపూరు గ్రామానికి చెందిన చింతగింజ సుందరయ్య(39) మృతి చెందాడు. మృతుని భార్య మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అపాచీ పరిశ్రమలో పని చేసే సుందరయ్య అనారోగ్యంతో సెలవు పెట్టి ఇంటి వద్దే ఉన్నాడు. పరిశ్రమకు సమీపంలో ఉండే మాక్స్‌కింగ్‌ పరిశ్రమలో పని చేస్తున్న భార్యను తీసుకు రావడానికి ద్విచక్ర వాహనంపై సుందరయ్య మంగళవారం సాయంత్రం బయలు దేరాడు. రహదారి నుంచి పారిశ్రామిక వాడకు వెళ్లే మార్గంలో బైక్‌ మలుపు తిరిగిన సమయంలో నెల్లూరు వైపు వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సుందరయ్యను 108 సిబ్బంది సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. పిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ కొండపనాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం మృత దేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement