రెవెన్యూ సమస్యలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలపై దృష్టి

Aug 5 2026 12:24 AM | Updated on Aug 5 2026 12:24 AM

● విద్యాశాఖా మంత్రి లోకేష్‌ బాబు రాజీనామాకు డిమాండ్‌ ● రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు ● ఈ నెల 10న జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు ● అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా కుట్రలు – 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

రెవెన్యూ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జేసీ గోవిందరావు సూచించారు. ఈ మేరకు వారితో సమీక్షించారు.
మెగా డీఎస్సీ అక్రమాలపై నిగ్గదీసి అడిగేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు.. ఈనెల పదో తేదీన నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలకు సమాయత్తమయ్యారు.

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ సమావేశాలు

బుధవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, తిరుపతి: డీఎస్సీ అవినీతి అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. సీబీఐ విచారణ చేపట్టడంతో పాటు.. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో మంగళవారం టౌన్‌ హాలు సమావేశాలు నిర్వహించారు. తిరుపతిలో నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగరంలోని 50 డివిజన్ల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రగిరిలో సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆదేశాల మేరకు తుమ్మలగుంటలో సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో బియ్యపు పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యవేడు నియోజక వర్గం నారామయణవనంలో సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రాంకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అన్ని మండలాల నుంచి కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రైల్వే కోడూరులో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు

డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గురువారం నుంచి ఆదివారం వరకు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. అదే విధంగా సోమవారం అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. అయితే వైఎస్సార్‌సీపీ చేపట్టే నిరసన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement