తిరుపతి అర్బన్: ఉద్యోగులు రోజువారి పరిపాలన బాధ్యతల నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అంతర్గత చైతన్యం–సార్థక నాయకత్వం కోసం గాఢమైన భావోద్వేగ సామరస్యాన్ని సృష్టించడం అనే అంశంపై ప్రత్యేక మోటివేషనల్ వర్క్‌షాపును ప్రముఖ లీడర్‌షిప్ కోచ్, రచయిత, ట్రావెల్ ఎక్స్‌ప్లోరర్ కార్తీక్ పూవనం నేతృత్వంలో చేపట్టారు. జిల్లా స్థాయికి చెందిన వివిధ విభాగాల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ ప్రధానంగా ఇతరులతో పోల్చుకోవడం కంటే వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించడం, కృతజ్ఞాత భావాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమ లక్షణాలుగా విశిదీకరించారు. అనంతరం డీఆర్వో నరసింహులు మాట్లాడుతూ భావోద్వేగ సామరస్యం, మానసిక ప్రశాంతతతో చక్కటి పాలనకు పునాదులు వేయవచ్చని వివరించారు. అనంతరం లీడర్‌షిప్ కోచ్ కార్తీక్ పూవనం మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు భరత్‌నాయక్, శివశంకర్‌నాయక్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయభరత్‌రెడ్డి, డీపీవో సుశీలాదేవి, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, అగ్రికల్చర్ జేసీ ప్రసాద్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజా నాయక్, అగ్రిమాపక అధికారి రమణయ్య, డ్వామా పీడీ మద్దిలేటి, సీపీవో రాజశేఖర్, డీఎంఅండ్‌హెచ్‌వో బాలకృష్ణనాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి భరత్‌కుమార్ పాల్గొన్నారు.


