డయల్‌ యువర్‌ సీఎండీకి 57 వినతులు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ సీఎండీకి 57 వినతులు

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

తిరుపతి రూరల్‌: ఏపీ ఎస్పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమానికి 57 సమస్యలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఇందులో సూళ్లురుపేటలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ సమస్యలు పరిష్కరించినట్టు తెలిపారు. సంస్థ డైరెక్టర్లు పి. అయూబాఖాన్‌, కె.గురవయ్య, కె.రామమోహన్‌రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్‌. పద్మ, యం.మురళీకుమార్‌, ఎన్‌.శోభావా లెంటీనా, సిహెచ్‌ రామచంద్రరావు, కె.సంపత్‌కుమార్‌, ఎస్‌.రమణ, జనరల్‌ మేనేజర్లు శ్రీకాంత్‌, చక్రపాణి, జగదీష్‌, భాస్కర్‌రెడ్డి, లత పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ రేపు

ఏపీ ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement