ఆరుతడి పంటలు సాగు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగు చేయండి

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

ఏర్పేడు: ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగు చేయాలని తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మండలంలోని అంజిమేడు, నచ్చనేరి గ్రామాల్లో వరి సాగును వారు విద్యార్థులతో కలిసి పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు తగ్గినందున వరి పంటకు ఆరుతడులుగా నీరు పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.మురళీకృష్ణ, ఏర్పేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ కందాటి మహేష్‌రెడ్డి, అసోసియేట్‌ డీన్‌ హేమలత, శాస్త్రవేత్తలు డా.ప్రతిమ, డా.కరీముల్లా, డా.సుబ్రమణ్యం, డా.వేమన, డా.చలం, డా.శ్రీవల్లీ, డా. రమ్యశ్రీ,, శ్రీకాళహస్తి సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు సాగరిక, సూర్యప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement