మా భర్త క్యాన్సర్‌తో మృతి చెందారు. రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం తిరిగి అలసిపోయాము. చివరికి నా భర్త మృతి చెందారు. కనీసం నాకై నా వితంతువు పింఛన్ ఇప్పించండి.
–బీ.కోమల, హరిపురం కాలనీ, తిరుపతి
నీరు లేక విద్యార్థినుల ఇబ్బందులు
పుత్తూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బోరు ఎండిపోయింది. తాగునీటి కోసం వి ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజు లుగా నీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్ల వాడకం ఆగిపోయింది. ట్యాంకర్ ద్వారా అందించే నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. కొత్తగా బోరు బావిని ఏర్పాటు చేయండి. –ఆర్.పద్మావతి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, పుత్తూరు


