రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

రేణిగుంట: రేణిగుంట–పూడి రైల్వే స్టేషన్ల మధ్యలో గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం రైలు కిందపడి మృతి చెందినట్లు రేణిగుంట జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదన్‌రావు పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. అతని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

గుర్తుతెలియని యువకుడి మృతి

తిరుపతి రూరల్‌: పాకాల మండలం, దామలచెరువు అక్కగార్లగుడి సమీపంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. రహదారిపై యువకుడు విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు తెలియకపోవడంతో మృత దేహాన్ని మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement