అయ్యా పింఛన్లు ఎప్పుడిస్తారు? | - | Sakshi
Sakshi News home page

అయ్యా పింఛన్లు ఎప్పుడిస్తారు?

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

● పీజీఆర్‌ఎస్‌కు 317 అర్జీలు

కలెక్టరేట్‌కు క్యూ కట్టిన బాధితులు

తిరుపతి అర్బన్‌: ‘అయ్యా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారా..?’ అంటూ కనిపించిన ప్రతి అధికారిని అడగడం కలెక్టరేట్‌ వద్ద సోమవారం కనిపించింది. రాష్ట్ర చరిత్రలోనే రెండేళ్లుగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించకపోవడం ఇదే ప్రథమం అంటూ పలువురు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారులు పోటెత్తారు. అర్జీలను కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌తోపాటు జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్‌, భరత్‌నాయక్‌, నాగార్జున అర్జీలను స్వీకరించారు. మొత్తం 317 అర్జీలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఫీజులు అధికం

ఓబూలవారిపల్లి మండలంలోని మంగంపేట సమీపంలోని ఓ స్కూల్‌లో అత్యధికంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం పేరుతో డబ్బులు గుంజేస్తున్నారని, దీంతో పేద కుటుంబాలకు చెందిన వారు నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు.

– భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ

రాయలసీమ జోన్‌ బూత్‌ కమిటీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement