సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 అథ్లెటిక్స్‌ విజేత ఎడిఫై బాలికల జట్టు | - | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 అథ్లెటిక్స్‌ విజేత ఎడిఫై బాలికల జట్టు

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

● 38 పతకాలతో సత్తా చాటిన వైనం ● జాతీయ స్థాయి పోటీలకు 12 మంది ఎంపిక

తిరుపతి గాంధీరోడు/ చంద్రగిరి: సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2026–27 పోటీల్లో తిరుపతికి చెందిన ఎడిఫై పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తెలంగాణ రాష్ట్రం ఘట్‌కేసర్‌ మండలం, నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్‌ స్కూల్‌లో జూలై 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో పాఠశాల విద్యార్థులు 38 పతకాలు సాధించారు. బాలుర విభాగంలో ఆరు వెండి, ఒక కాంస్య పతకం సాధించగా, బాలికల విభాగంలో 17 బంగారు, నాలుగు వెండి, 10 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. ఎడిఫై బాలికల జట్టు వరుసగా నాలుగో ఏడాది కూడా ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కై వసం చేసుకుంది. అలాగే పది మంది బాలికలు, ఇద్దరు బాలురు సీబీఎస్‌ఈ జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. జాతీయ స్థాయి పోటీలు అక్టోబర్‌ 15 నుంచి 20వ తేదీ వరకు పంజాబ్‌ రాష్ట్రంలోని పాటియాలలోని ఎస్‌డీ పబ్లిక్‌ స్కూల్‌లో జరగనున్నాయి. విద్యార్థులను పాఠశాల చైర్‌పర్సన్‌ పి.సులోచన, డైరెక్టర్‌ పి.ప్రణీత్‌, అకాడమిక్‌ డీన్‌ పి.జాహ్నవి, ప్రిన్సిపల్‌ టి.దేవరాజులు, కోచ్‌లు పి.రమేష్‌, బిష్ణు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement