అఽథ్లెటిక్స్‌లో నిత్యహాసిని ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

అఽథ్లెటిక్స్‌లో నిత్యహాసిని ప్రతిభ

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

శ్రీకాళహస్తి: తిరుపతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ ఇంటర్‌–డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2026లో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన నిత్య ఫిట్నెస్‌ సెంటర్‌ అధినేతలు జ్యోతిరావు, రూపాదేవి దంపతుల కుమార్తె నిత్య హాసిని అద్భుత ప్రతిభ కనబరిచి రెండు విభాగాలలో ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. అండర్‌–18 బాలికల విభాగంలో జరిగిన పోటీల్లో నిత్య హాసిని షాట్‌పుట్‌ విభాగంలో 11.38 మీటర్లు విసిరి ప్రథమ స్థానం సాధించగా, డిస్కస్‌ త్రోలో 29.43 మీటర్లు విసిరి మరోసారి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయాలతో నిత్యహాసిని రెండు విభాగాల్లోనూ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు అర్హత సాధించింది. నిత్యహాసిని సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, శిక్షకులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శాప్‌ అధ్యక్షులు కిషోర్‌ తమకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement