కట్టెల లారీని ఢీకొన్న స్కూటీ | - | Sakshi
Sakshi News home page

కట్టెల లారీని ఢీకొన్న స్కూటీ

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

– యువకుడి మృతి

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓటేరు గ్రామ సమీపంలోని పూతలపుట్టు – నాయుడుపేట జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. తాజ్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద వంతెన నిర్మాణ పనుల కారణంగా సర్వీస్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. అదే రోడ్డులో సెవెన్‌ హిల్స్‌ హోటల్‌ వద్ద కట్టెల లోడ్డు లారీని రోడ్డుపై నిలిపివేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 11.50 గంటల సమయంలో సదరన్‌ స్పైస్‌ హోటల్‌ వైపు నుంచి రేణిగుంట రోడ్డు వైపు వేదాంతపురం పంచాయతీకి చెందిన టి.సురేష్‌ (26) ఎన్‌.వంశీ ఆచారి స్కూటీపై వెళుతూ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని గుర్తించక వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో టి.సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వంశీ ఆచారిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తిరుపతి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement