నేను కరకంబాడి సమీపంలోని తారకరామానగర్‌లో నివాసం ఉంటున్నాం. ఇటీవల నా కుమార్తె కవిత హౌసింగ్‌కు దరఖాస్తు చేసుకుంది. అధికారులు మీ అమ్మ తంగరాజు రత్నమ్మ పేరుపై 20 విద్యుత్ మీటర్లు ఉన్నాయి.. ధనవంతులకు హౌసింగ్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. 20 మీటర్లు ఏలా వచ్చాయో తెలియడం లేదు. నాకున్నది ఒకే విద్యుత్ మీటర్. మిగిలిన 19 ఎలా వచ్చాయో తెలియదు.
–తంగరాజు, రత్నమ్మ, తారకరామానగర్, రేణిగుంట మండలం
వంద శాతం వికలత్వం ఉంది సార్
మేము చంద్రగిరి మండలం, అరుణాతండాలో నివాసం ఉంటున్నాం. మా బాబు హర్షవర్దన్‌కు 100 శాతం వికలత్వం ఉంది సార్. సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంది.అయితే పింఛన్ కోసం సచివాలయం నుంచి కలెక్టరేట్ వరకు తిరుగుతున్నాం. అధికారులు సదరన్ సర్టిఫికెట్ తాత్కలికంగా ఇచ్చారు. శాశ్వత సదరన్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెబుతున్నారు. మరోవైపు పింఛన్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. –హర్షవర్దన్‌తో తల్లి గీత, తండ్రి శివ


