వెండి అంబారిపై చంగల్రాయ స్వామి | - | Sakshi
Sakshi News home page

వెండి అంబారిపై చంగల్రాయ స్వామి

Aug 3 2026 4:09 AM | Updated on Aug 3 2026 4:09 AM

వెండి అంబారిపై చంగల్రాయ స్వామి

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయ చంగల్రాయ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఆదివారం ఉదయం వైభవంగా కొనసాగుతున్నాయి. చంగల్రాయ స్వామి వారిని సుందరంగా అలంకరించి వెండి అంబారి వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

ధ్వజారోహణ పూజలు

ఆలయంలో చంగల్రాయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం అరటి ఆకు మీద ధ్వజపటం ఏర్పాటు చెసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌, పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement