తిరుపతి మంగళం : తిరుపతి అర్బన్ మండలం, మంగళం పరిధి, తిరుమలనగర్ పంచాయతీలోని ప్రభు త్వ అనాధీన భూమికే తప్పుడు రికార్డులు సృష్టించి ఏకంగా శాశ్వత భవన నిర్మాణం చేపట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం భవన అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. అయితే రెవెన్యూ అధికారులకు టీడీపీ నాయ కుల నుంచి సిఫార్సులు రావడంతో కూల్చివేత పను లు మధ్యలోనే ఆపేశారు. వివరాలు.. మంగళం పరి ధిలోని చెన్నాయగుంట లెక్క దాఖలా సర్వే నం.228 లో సుమారు రూ.2 కోట్ల విలువ చేసే ప్రభుత్వ అనాధీన భూమి ఉంది. దీన్ని స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించుకుని అందులో ఏకంగా శాశ్వత భవన నిర్మాణం చేపట్టారు. ఇటీవల ఆ భూమిని ప్రభుత్వం తమకు కేటాయించిదంటూ నకిలీ పత్రాలు సృష్టించి ఎవ్వరూ అడ్డు చెప్పకుండా చేశారు. అందులో ఏకంగా పిల్లర్లు వేసి భవన నిర్మాణం చేపట్టారు. దాంతో పాటు మరో రెండు ఇళ్ల నిర్మాణానికి పునాదులు కూడా తవ్వారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో శనివారం రెవె న్యూ అధికారులు భవన నిర్మాణాన్ని కూల్చివేసేందుకు పూనుకున్నారు. ఇంతలో రెవెన్యూ అధికారులకు టీడీపీ బడా నాయకుల నుంచి ఫోన్లు రావడంతో మధ్యలోనే పనులు నిలిపేసి వెళ్లిపోయారు.


