తిరుపతి మంగళం : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల్లో ఆదరణ పొంది కాపు రిజర్వేషన్ కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి గుర్తు చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, బలిజ సంఘం నాయకులు నీలం బాలాజి ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ నిర్వహించారు. ఇందులో భూమన ముఖ్యఅతిథిగా పాల్గొని మద్రగడ పద్మనాభం చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభంతో తనకు 40 ఏళ్ల పరిచయం ఉందని, ఆయనలోని ఉద్యమస్పూర్తి ఆదర్శప్రాయమన్నారు. తుని ఘటనలో తనను అరెస్ట్ చేస్తే తనకు అండగా నిలిచారని తెలిపారు. ప్రజాసంక్షేమం, కాపు ఉద్యమాల కోసం తన ఆస్తులను సైతం అమ్ముకున్నారని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం ఆశయాలు జగనన్నతోనే సాధ్యమన్నారు. ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి కృషి చేసిన ఏకై క నాయకుడు జగనన్న అని కొనియాడారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో కాపుల సంక్షేమం కోసం కృషి చేసిన ఏకై క నాయకుడు ముద్రగడ అన్నారు. అలాంటి నాయకుడు మన మద్యలేకపోవడం సమాజానికి, వైఎస్సార్‌సీపీకి ఎంతో తీరనిలోటు అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, తిరుపతి బలిజ సంఘం నాయకులు నీలం బాలాజి మాట్లాడుతూ కాపు రిజర్వేషన్, కాపుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప ఉద్యమనేత ముద్రగడ పద్మనాభమన్నారు. కాపుల కోసం ముద్రగడ తర్వాత కృషి చేసిన ఏకై క నాయకుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో బలిజ భవనం కోసం కేటాయించిన స్థల పరిరక్షణకు అప్పటి ఎమ్మెల్యేగా భూమన కరుణాకరరెడ్డి సహకారం అందించడంతో పాటు ప్రహారీ నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు. తిరుపతిలో బలిజలకు ఉన్నత పదవులు కేటాయించారని తెలిపారు. కాపుల ఆశలు, ఆశయాలు జగనన్న పాలనలోనే సాధ్యమవుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, నాయకులు ఆరే.అజయ్‌కుమార్, బొమ్మగుంట రవి, బత్తల గీతాయాదవ్, రాయల్ కాపునాడు చిత్తూరుజిల్లా పార్లమెంట్ అధ్యక్షులు ఎన్వీ సురేష్‌రాయల్, బెల్లం రమేష్, అనీష్‌రాయల్, దినేష్‌రాయల్, పసుపులేటి సురేష్, వెంకటేష్‌రాయల్, మధుబాల, గోలి విజయలక్ష్మి, కవిత, శారద, పద్మ, నవీన్ పాల్గొన్నారు.


