అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని వినతి

Jul 30 2026 5:18 AM | Updated on Jul 30 2026 5:18 AM

తిరుపతి రూరల్‌ : తిరుపతి రూరల్‌ మండలం పేరూరు వద్ద ఉన్న వకులమాత ఆలయానికి వెళ్లే మలుపులో పూతలపుట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై అండర్‌ పాస్‌ను ఏర్పాటు చేయాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కోరారు. ఆయన బుధవారం జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి తిరుపతి బైపాస్‌లోని వకుళమాత ఆలయం సమీపంలో ఇప్పటికే ఆమోదం పొందిన అండర్‌ పాస్‌ను యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మల్లవరం జంక్షన్‌–రేణిగుంట సెక్షన్‌ (ఎన్‌హెచ్‌–71)లో కిలోమీటర్‌ 99.645 వద్ద అండర్‌పాస్‌ను యథాతథంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వకుళమాత ఆలయం సమీపంలో ప్రతిపాదించిన అండర్‌పాస్‌ను ఒమేగా ఆస్పత్రి సమీపంలోని కిలోమీటర్‌ 99.230 ప్రాంతానికి మార్చే ప్రతిపాదన లేదన్నారు.

ఈవీఎంల గోడౌన్‌ తనిఖీ

రేణిగుంట:జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌, సీడబ్ల్యూసీ గోడౌన్‌ను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, సీలింగ్‌ తదితరాలను పరిశీలించి రిజిస్టర్‌లో సంతకం చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, ఈవీఎంల గోడౌన్‌ ఇన్‌చార్జి జీఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భరత్‌నాయక్‌, తహసీల్దార్‌ శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement