తిరుపతి క్రైం : మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న జయంత్(20) అనే విద్యార్థి అదృశ్యమైన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి బండ్లవీధికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు జయంత్‌కు ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటు ఉండడంతో అప్పులు చేసినట్లు తెలిసింది. కళాశాల ఫీజుల కోసం తండ్రి ఇచ్చిన నగదును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి తండ్రి మందలిస్తారనే భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కుమారుడు కనిపించకపోవడంతో తండ్రి సుబ్రహ్మణ్యం ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిప్రకాష్ తెలిపారు.


