భగవంతుడా.. నా సమస్యకు పరిష్కారం చూపించూ!
సర్వే నంబర్ 134లో నాకు 57.5 సెంట్ల పొలం ఉంది. ఆ మేరకు పాస్ పుస్తకం ఉంది. అయితే అన్‌లైన్‌లో మాత్రం 49 సెంట్లు చూపిస్తుంది. దీంతో ఏడాదిగా అన్‌లైన్‌లో మార్పు చేసుకోవడానికి తిరుగుతున్నాను. 2024 డిసెంబర్‌లో రెవెన్యూ సదస్సుల్లో అర్జీ ఇచ్చాను. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. సమస్య పరిష్కారం కాలేదు.
– వడ్లపల్లి చెంగల్‌రాయుడు,
గొల్లపల్లి, రైతు, చిన్నగొట్టిగల్లు మండలం
నెలలుగా తిరుగుతూనే ఉన్నాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తర్వాత రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రెవెన్యూ సదస్సులో మా భూమికి పాస్ పుస్తకాల కోసం అర్జీ ఇచ్చాం. అయినా పరిష్కారం కాలేదు. నెలలుగా తిరుగుతూనే ఉన్నాం. తాజాగా రెవెన్యూ క్లినిక్ పేరుతో కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలోనూ అర్జీ ఇచ్చాం. ఇకనైనా అధికారులు స్పందించి మాకు పాస్ పుస్తకాలు ఇప్పించండి.
– తుపాకుల సిద్ధమ్మ,
అరేపల్లి రంగంపేట, చంద్రగిరి మండలం
భగవంతుడా.. నా సమస్యకు పరిష్కారం చూపించూ!


