వేడుకగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం స్నాతకోత్సవం
తిరుమల: ధర్మగిరిలోని 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం గురువారం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధా ని మాట్లాడుతూ వేద విజ్ఞాన పీఠంలోని 146 మంది విద్యార్థులను వేద, ఆగమ, స్మార్త పండితులుగా తీర్చిదిద్దామని చెప్పారు. పట్టాలు పొందిన స్నాతకులు నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తర్వాత మంచి విద్యార్థులను తయారుచేయాలని ఆకాంక్షించారు. అనంతరం వేద విద్య పూర్తిచేసుకున్న స్నాతకులకు పట్టాలతో పాటు శ్రీవారి వెండి డాలర్‌ను అందజేశారు.
రేపటి నుంచి
విద్యాసంస్థలకు సెలవులు
తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు శనివారం నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సమాచారం అందించారు. తిరిగి ఈనెల 19వ తేదీన విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆ ప్రకటనలో డీఈఓ హెచ్చరించారు.
పరిశోధన సలహాదారుగా ఐఐటీ ప్రొఫెసర్
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిశోధన సలహాదారుగా ఐఐటీ ప్రొఫెసర్ వాసుదేవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు వీసీ నర్సింగరావు గురువారం ఉత్తర్వులు అందజేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో దాదాపు 40 ఏళ్లుగా బోధన, పరిశోధన రంగాల్లో పని చేసిన ఆయన ఐఐటీ తిరుపతిలో సైతం విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
వేడుకగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం స్నాతకోత్సవం


