జగనన్న హయాంలో రూ.400 కోట్లు
అభివృద్ధికి నోచుకోని పునరావాస కాలనీ ఆర్‌ఆర్–5
పరిహారం అందక కుటుంబాల పాట్లు
రోగాలతో గ్రామస్తుల అగచాట్లు
వైఎస్సార్ సీపీ హయాంలో
రూ.400 కోట్లు
●
ఓబులవారిపల్లె: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట ఏపీఎండీసీ బైరైటీస్ గనులకు కూత వేటు దూరంలో ఉన్న మంగంపేట కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాలు దశాబ్దలుగా కాలుష్యం కోరల్లో చిక్కుకుని అగచాట్లు పడుతుండేవి. 2019లో వైస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తరువాత మూడు గ్రామాల తరలింపునకు ఉత్తర్వు లు జారీ చేశారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు సమస్యలు పరిష్కరించకుండా అభివృద్ది చేయకపోవడంతో కాలుష్యం బారిన పడిన ఆ గ్రామాల ప్రజలు రోగాల బారిన పడి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోని జీవనం సాగిస్తున్నారు.
అభివృద్ధికి నోచుకోని
పునరావాసకాలనీ ఆర్‌ఆర్– 5
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంగంపేట కాపుపల్లె హరిజనవాడ, అరుంధతివాడ కాలుష్య గ్రామాల తరలింపు కోసం ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్–5 పునరావాస కాలనీలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఇందులో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, ఆరోగ్య కేంద్రం, సచివాలయం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, శ్మశానం, పశువుల మేతకు భూములు కేటాయించకపోవడం తదితర అభివృద్ధి పనులను నిర్వహిచకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి వీలు లేకుండా పోతుంది.
కాలుష్యంతో రోగాల బారిన ప్రజలు
ప్రభుత్వం ఆర్‌ఆర్–5 పునరావాస కాలనీలో అభివృద్ధి పనులు చేయకపోవడంతో గ్రామాలు తరలి వెళ్లలేదు. దీంతో నిత్యం ఏపీఎండీసీ గనుల నుంచి వెలికి తీసిన వృథా మట్టిని గ్రామానికి సమీపంలో డంపింగ్ చేస్తుండడంతో ప్రజలు నిత్యం కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యంతో గ్రామం ఖాళీ చేయలేక ఆర్‌ఆర్–5లో ఇల్లు నిర్మించుకోలేక వారు అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆర్‌ఆర్–5 పునవాస కాలనీలో అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసి, ప్యాకేజీలు, పరిహారం అందించి గ్రామాలను తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆర్‌ఆర్–5 పునరావాస కాలనీలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు
సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో మంగంపేట కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాల తర లింపునకు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి గనుల శాఖ మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సహకారంతో మూడు గ్రామాల పునరావాసానికి 2024లో రూ.400 కోట్లు కేటాయించారు. ముక్కావారిపల్లె పంచాయతీలో దాదాపు వంద ఎకరాలు భూసేకరణ చేసి, చదును చేయించారు. లేఅవుట్‌లు వేయించి పునరావాస కాలనీ ఆర్‌ఆర్–5 కాలనీ ఏర్పాటు చేసి, అందులో ప్లాట్‌లు వేయించారు. 675 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వన్‌టైమ్ సెటిల్‌్‌మెంట్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.8.16 లక్షల పరిహారం ఇచ్చి, 5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. విద్యుత్ సబ్‌స్టేషన్, వాటర్ హెడ్ ట్యాంక్‌లు, తాగునీటి కోసం బోర్లు, సిమెంటు రోడ్లు అభివృద్ధి పనులు చేయించారు.
కేటాయించిన స్థలం అభివృద్ధి చేయాలి
మంగంపేట హరిజవా డ, అరుంధతివాడ రెండు గ్రామాల ప్రజలకు అప్పట్లో జిల్లా కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం 23 సెంట్లలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. ఆర్‌ఆర్–5లో 23 సెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు విషయంపై ప్రస్తుతం అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వ డం లేదు. దళిత గ్రామాలకు కేటాయించిన స్థలా న్ని అభివృద్ధి చేయాలి.
– పసుపులేటి హరికృష్ణ,
కాపుపల్లె దళితవాడ, ఓబులవారిపల్లె
జగనన్న హయాంలో రూ.400 కోట్లు
జగనన్న హయాంలో రూ.400 కోట్లు


