రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ
కలెక్టరేట్ వద్దు.. మండలాల్లోనే.. చంద్రగిరితోనే.. కలెక్టరేట్‌లో క్లినిక్‌కు బ్రేక్ అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీదారులు చంద్రగిరి నియోజకవర్గం నుంచి 751 అర్జీలు
అర్జీ ఆగింది!
తిరుపతి అర్బన్: రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో అధికారులు చేపట్టిన రెవెన్యూ క్లినిక్ అర్జీదారులకు నిరాశ మిగిల్చింది. క్లినిక్‌లో అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం చూపుతారని భావించి చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అర్జీదారులు గురువారం కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున విచ్చేశారు. అయితే గతంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులు, కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్ తరహాలోనే అర్జీలను తీసుకుని పంపించారు. దీంతో అర్జీదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ మౌర్య, డీఆర్వో నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, రోజ్‌మాండ్, ఏపీఐఐసీ అధికారి విజయ్‌భరత్‌రెడ్డి, జిల్లా సర్వే అధికారి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. ఆయా మండలాలకు చెందిన అర్జీలను తహసీల్దార్లు, వీఆర్వోలు స్వీకరించారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక రోజు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. అయితే అర్జీదారుల సంఖ్య అత్యధికంగా వస్తున్న నేపథ్యంలో ఏ మండల తహసీల్దార్ పరిధిలో ఆ మండల అర్జీదారులకు రెవెన్యూ క్లినిక్‌ను ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్వహించాలని భావిస్తున్నట్లు డీఆర్వో నరసింహులు స్పష్టం చేశారు. దీంతో చంద్రగిరి నియోజకవర్గంతోనే కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌కు బ్రేక్ పడింది.
రికార్డు స్థాయిలో రెవెన్యూ క్లినిక్‌కు అర్జీలు
కలెక్టరేట్‌లో జరిగిన రెవెన్యూ క్లినిక్‌కు చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 751 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆర్‌సీ పురం మండలం నుంచి 216, తిరుపతి రూరల్ నుంచి 202, పాకాల నుంచి 110, చంద్రగిరి నుంచి 106, చిన్నగొట్టిగల్లు నుంచి 65, ఎర్రావారిపాళెం నుంచి 52 అర్జీలు వచ్చాయన్నారు.
వీఆర్వో గుణభూషణం నాయుడు సస్పెన్షన్
ఆర్‌సీపురం మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి జి. గుణభూషణం నాయుడు సర్వే నంబర్ 206–4లో కు సంబంధించి పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీ పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా తప్పుడు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
రివర్స్ పద్ధతితో
అర్జీదారులకు కష్టాలు
కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో భిన్నంగా వ్యవహరించడంతో తిప్పలు తప్పలేదు. ముందుగా అర్జీలు ఇచ్చారు.. వాటిని పూర్తి చేసిన తర్వాత అన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని రసీదు తీసుకున్న తర్వాత అధికారులను కలిసేలా పద్ధతి పెట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు అన్‌లైన్ కోసం ఆరు కౌంటర్లు పెట్టారు. అయితే అన్‌లైన్ రిజిస్త్రేషన్‌కు గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో అర్జీదారులకు తాగునీరు, భోజనం లేక నానా తిప్పులు పడాల్సి వచ్చింది.
నిరాశను మిగిల్చిన రెవెన్యూ క్లినిక్


