అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్నదాత కష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండేవాడు. నకిలీలు.. నాణ్యతలేని విత్తనం, ఎరువుతో ఇక్కట్లు పడుతున్న మట్టి మనిషికి మంచి విత్తనం – మంచి ఎరువు దన్ను అని భావించారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అందుకే కష్టనష్టాలు అ | - | Sakshi
Sakshi News home page

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్నదాత కష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండేవాడు. నకిలీలు.. నాణ్యతలేని విత్తనం, ఎరువుతో ఇక్కట్లు పడుతున్న మట్టి మనిషికి మంచి విత్తనం – మంచి ఎరువు దన్ను అని భావించారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అందుకే కష్టనష్టాలు అ

Jan 10 2026 9:43 AM | Updated on Jan 10 2026 9:43 AM

అయితే

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న

రైతు సంక్షేమం కోసం గత ప్రభుత్వంలోవిప్లవాత్మక మార్పులు

రూ.కోట్ల ఖర్చుతో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటు

నాణ్యత పరీక్షించిన తర్వాతే విత్తనాలు, ఎరువుల వాడకం

నేడు అగ్రి ల్యాబ్‌లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కారు

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026

వరదయ్యపాళెం: చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి నుంచి రైతన్నలంటే చులకనే. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూస్తుంటారు. నేడు అన్నదాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలే అందుకు నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లు నిధులు వెచ్చించి, రైతన్నల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లను నిర్వీర్యం చేస్తోంది. తిరుపతి జిల్లా లో 6 అగ్రిటెస్ట్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయ గా, అవి నేడు నిరుపయోగంగా మారాయి. నాడు ఎంతో మేలు చేసిన అగ్రిటెస్ట్‌ ల్యాబ్‌లు నేడు నిర్వీర్యంగా మారి పాలకుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. ఆయా ల్యాబ్‌లకు చెందిన రూ.కోట్ల విలువ చేసే భవనాలు, పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. కనీసం ల్యాబ్‌ను తెరిచే దిక్కు కూడా లేకుండా మూత వేసి ఉన్నారు.

గతంలో రైతు సంక్షేమం కోసం..

ఎంతో ఉన్నత ఆశయంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతన్న సంక్షేమం కోసం సుమారు రూ.కోటి ఖర్చు పెట్టి అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లు నిర్మించారు. రైతులు ఉపయోగించే విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత సాగు చేపడితే మేలైన దిగుబడులు సాధించే వీలుంటుందన్న ఉద్దేశంతో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను అప్పటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 60 లక్షల వ్యయంతో భవన నిర్మాణాలు, మరో రూ.40 లక్షల ఖర్చుతో వివిధ రకాల విలువైన పరికరాలు, రసాయనాలు, కంప్యూటరైజ్డ్‌ సిస్టమ్‌లోనే అందుబాటులోకి తెచ్చింది. నియోజకవర్గంలోని వ్యవసాయ సబ్‌ డివిజన్‌కు ఒక్కో అగ్రి ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

విత్తనాలు, ఎరువులు, మందులకు పరీక్షలు

జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఎరువులు, విత్తనాలు నాణ్యతను పరీక్షించుకుని నివేదికల తర్వాత సాగు చేసుకునే వారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మూడు రకాలుగా జర్మినేషన్‌, ఫిజికల్‌ ఫ్యూరిటీ, మాయిశ్చర్‌ పద్ధతిలో ఇతర అధికారులు పరిశీలన జరిపేవారు. అంతేకాకుండా నత్రజని, పొటాషియం, భాస్వరం సామర్థ్యం తెలుసుకునేందుకు రసాయనాలను ఉపయోగించేవారు. ఎరువుల నాణ్యతను గుర్తించి ఆ తర్వాత పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు వ్యవసాయశాఖ అధికారులు సలహాలు, సూచనలు చేసేవారు. కాని అగ్రి ల్యాబ్‌లను చంద్రబాబు ప్రభుత్వం మూసి వేయడంతో వాటిలో పనిచేసే అధికారులను ఇతర విభాగాలకు డిప్యూటేషన్‌ వేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవస్థను పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

ల్యాబ్‌ల కుదింపు

తిరుపతి జిల్లాలో గతంలో పనిచేసిన వెంకటగిరి, సత్యవేడు, చంద్రగిరి, సూళ్లూరుపేట అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు పూర్తిగా మూతపడ్డాయి. గూడూరు, శ్రీకాళహస్తిలో ఉన్న ల్యాబ్‌ల్లో గూడూరు నెల్లూరు జిల్లా లో కలిసిపోవడంతో, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలో ఉన్న అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ మాత్రమే మిగిలింది. రాష్ట్రంలో ఒకప్పుడు 114 అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లుండగా, ఇప్పుడు వాటిని 44కి కుదించారు. ఈ నిర్ణయం రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ల్యాబ్‌ నిర్వీర్యం.. రైతులకు శాపం

శ్రీకాళహస్తి ల్యాబ్‌పై పెరిగిన ఒత్తిడి

శ్రీకాళహస్తి: మంచి విత్తనం – మంచి ఎరువు రైతుకు అందాలనే దృఢ సంకల్పంతో ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలన్నది మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశయం. అయితే ఆయన ఆశయానికి ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాళహస్తి మార్కెట్‌ యార్డులో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రస్తుతం ఏడాదికి సుమారు 1,800 శాంపిల్స్‌ పరీక్షిస్తోంది. జిల్లా మొత్తానికి ఒక్క ల్యాబ్‌ మాత్రమే ఉండటంతో శ్రీకాళహస్తి అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న సత్యవేడు అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌ను తెరిచే దిక్కే లేదు. ఆ ల్యాబ్‌కు కేటాయించిన సిబ్బంది ఏమయ్యారో తెలియని పరిస్థితి. విలువైన పరికరాల, ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిరుపయోగంగా మార్చేశారు. రైతులు స్వయంగా విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించేందుకు వీలు లేకుండా మార్చేశారు. ఏటా సుమారు 300 మంది వరకు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగు వేయలేదు.

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న1
1/4

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న2
2/4

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న3
3/4

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న4
4/4

అయితే అనావృష్టి.. లేకుంటే అతివృష్టితో ఇక్కట్లు పడే అన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement