దయనీయ స్థితిలో ల్యాబ్
తడ: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రైతుల కోసం సూళ్లూరుపేట నియోజక వర్గానికి సంబంధించి తడ మండలం, కొండూరు ఏఎంసీ మార్కెట్ యార్డు ప్రాంగణంలో సుమారు రూ.కోటి వ్యయంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను నెలకొల్పారు. ఆ ల్యాబ్‌లో సేవలు ప్రారంభం అయ్యే సమయానికి ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం అగ్రి ల్యాబ్ ముళ్ల చెట్ల నడుమ దయనీయ పరిస్థితికి నిలువెత్తు సాక్ష్యంలా మిగిలింది.
వెంకటగిరి(సైదాపురం): రైతులు నాణ్యమైన పంటలు పండించుకుని ఉన్నతస్థాయిలో దిగుబడులు సాధించుకునేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్ వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లను తీసుకొచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ల్యాబ్‌ను నిర్వీర్యం చేశారు.
దయనీయ స్థితిలో ల్యాబ్
దయనీయ స్థితిలో ల్యాబ్


