ఇద్దరికి ఐదేళ్ల జైలు
– IIలో
ఎర్రచందం కేసులో ఇద్దరికి ఐదేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు.
అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌కు తాళం
సూళ్లూరుపేట : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ.79 లక్షలు ఖర్చు చేసి ఒక అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవి మూతపడేలా చేసింది.
ల్యాబ్‌ను ఎందుకు మూసి వేశారు?
గత ప్రభుత్వం ఏర్పాటు చేసి ల్యాబ్‌ను ఎందుకు మూసివేశారు. రైతులకు ఉపయోగపడే ఇలాంటి వాటిని మూసివేయడం కూటమి ప్రభుత్వానికి తగ దు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు నకిలీ వస్తున్నాయనే వాటిపై రైతుల్లో అపనమ్మకం ఉంది. అలాంటి సమయంలో ల్యాబ్‌కెళ్లి పరీక్ష చేయించి తెలుసుకుంటాం కదా.. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కక్షపూరితంగా మూసివేయడం తప్పు.
– సుంకర అల్లెయ్య, రైతు, నాదెళ్లవారికండ్రిగ
భూసార పరీక్షలు చేయించుకునే వాళ్లం
గతంలో జిల్లా కేంద్రాలకు వెళ్లి భూసార పరీక్షలు చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఇక్కడే మట్టి నమూనాలు ఇస్తే ల్యాబ్ రిపోర్టు ఇస్తున్నారు. అంటే భూసార పరీక్షలు ఎలాంటి ఖర్చులు లేకుండా మనకు దగ్గరలోనే చేయించుకుంటున్నాం. అలాగే విత్తనాలు ఎరువులపై అనుమానాలుంటే వెంటనే ల్యాబ్‌కెళితే పరీక్షలు చేసి ఇస్తున్నారు కదా! రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఇలాంటి ల్యాబ్‌ను మూసివేయడం మంచిది కాదు.
– బత్తల భూపయ్య, నాయుడుపేట మండలం
ఇద్దరికి ఐదేళ్ల జైలు


