జెడ్పీ నిధులతో టీడీపీ నేత రాచబాట
తొట్టంబేడు: మండలంలోని బసవయ్యపాళెంలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో పెద్దలు మాత్రం ‘ప్రజా సమస్యలు మాకెందుకు? మా రాజరిక దర్పం మాకు ఉంటే చాలు’ అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. బసవయ్యపాళెంలో ఓ టీడీపీ నాయకుడు జెడ్పీ నిధులతో తన ఇంటి నుంచి పొలానికి, ప్లాట్లకు సీసీరోడ్డు వేసుకున్నాడు. అంతే కాకుండా చైన్నె రోడ్డు నుంచి లింకురోడ్డు కూడా ఏర్పాటు చేయించుకున్నాడు. అధికారులు కూడా కూటమి నాయకులకే పనులు చేస్తాం.. ప్రజల గోడు మాకు పట్టదన్న చందంగా వ్యహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంఽధిత అధికారులు స్పందించి జెడ్పీ నిధులతో సొంత మార్గం వేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జాతీయ స్థాయిలో ఎస్‌జీఎస్ విద్యార్థి ప్రతిభ
తిరుపతి సిటీ: తమిళనాడు రాష్ట్రం దిండిగల్ వేదికగా ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఎయిర్‌ఫోర్స్ అటాచ్‌మెంట్ క్యాంప్‌లో తిరుపతి ఎస్‌జీఎస్ కాలేజీ ఎన్‌సీసీ విద్యార్థి దితిన్ పాల్గొని ప్రతిభ చూపి ప్రశంసాపత్రాన్ని పొందారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థిని ఎస్‌జీఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి సత్యనారాయణ బుధవారం అభినందించారు.
జెడ్పీ నిధులతో టీడీపీ నేత రాచబాట


