టీటీడీకి రూ.20 లక్షల విరాళం
తిరుమల: బెంగళూరుకు చెందిన ఎస్పీ మైక్రో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం బా లాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,07,777, అలాగే శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు తమిళనాడు రాష్ట్రం శివకాశికి చెందిన స్టాండర్డ్ మ్యాచ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 లక్షల విరాళాన్ని ఆ సంస్థల ప్రతినిధులు తిరుమలలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి ఆయన కార్యాలయంలో అందజేశారు.
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
వరదయ్యపాళెం: చెన్నవారిపాళెం దళితవాడలోని ఓ ఇంట్లో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. చెన్నవారిపా ళెం దళితవాడకు చెందిన విజయ్‌కుమార్ శ్రీసిటీ ఉద్యోగి తన ఇంటికి తాళం వేసుకుని భార్యతో కలసి కంపెనీకి వెళ్లడంతో అదే గ్రామానికి చెందిన కె.శేఖర్(37), జి.కిరణ్(25) ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు బుధవారం పాండూరు మార్గంలోని త్రయంబకేశ్వరాలయ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా అటువైపుగా వస్తున్న శేఖర్, కిరణ్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చోరీ చేసినట్లు అంగీకరించడంతో వారిని అరెస్టు చూపి, సత్యవేడు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
టీటీడీకి రూ.20 లక్షల విరాళం


