పోటు కార్మికులకు రుణ పత్రాల పంపిణీ
తిరుపతి కల్చరల్: మిట్టవీధిలోని బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని పోటులో పని చేస్తున్న 31 మంది సభ్యులకు రూ.2.44 కోట్లు రుణ మంజూరు పత్రాలను బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ కె. బుచ్చిరాంప్రసాద్, చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరుపతి శాఖ ద్వారా ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 504 కుటుంబాలకు రూ.6,07,67,510 రుణాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ పీఆర్‌ఎల్ కుమార్, సీనియర్ అస్టెంట్ కార్తిక్, ఎగ్జిక్యూటీవ్ సభ్యులు డి.లీలావతి, సభ్యులు భాగవతుల జయలక్ష్మి, సీఆర్‌కే శేషగిరిరావు, వేంద హరి, సంస్కార్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజేష్, రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యుడు చిత్రపు హనుమంతరావు పాల్గొన్నారు.


