ఇసుక ట్రాక్టర్ల సీజ్
రేణిగుంట: మండలంలోని స్వర్ణముఖి నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను మంగళవారం రేణిగుంట– పుత్తూరు రహదారిలోని ఎల్లమ్మ గుడి వద్ద తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సీజ్ చేసి, రెవె న్యూ కార్యాలయానికి తరలించారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
కోర్టు కాంప్లెక్స్ స్థలం పరిశీలన
తిరుపతి తుడా: జిల్లా కోర్టు కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం దామినేడు వద్ద రాష్ట్ర ప్రభు త్వం కేటాయించిన భూములను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, ఆర్డీఓ రామ్మోహన్, రెవెన్యూ, నీటిపారుదల, ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా కోర్టు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధితోపాటు చుట్టు ప క్కల ప్రాంతాల అభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ ప్రతిపాదిత రహదారికి సమీపంలో ఉన్న ఇతర భూ ములన్నింటికీ అవకాశం కల్పించడం కోసం 30 మీటర్ల రహదారి నిర్మాణానికి సంబంధించిన దామినేడు మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్‌మెంట్‌ను పరిశీలించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. తుడా సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, పీఓ దేవి కు మారి, నీటిపారుదల శాఖ ఈఈ శివారెడ్డి, రూ రల్ తహసీల్దార్ జనార్దన్ రాజు ఉన్నారు.
ఇసుక ట్రాక్టర్ల సీజ్


