పునర్విభజన కాదు.. రాజకీయ విభజన
వాకాడు: జిల్లాల పునర్విభజన పేరుతో టీడీపీ రాజకీయ విభజన జరుగుతుందని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన వాకాడులోని తన నివాసంలో నాయకులతో సమావేశమయ్యారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి భిన్నంగా విభజన జరుగుతోందన్నారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లో ఓ విధంగా క్యాబినేట్‌లో మరో విధంగా ఆమోదం తెలిపారని అన్నారు. తుది నోటిఫికేషన్‌లో మార్పు లు చేర్పులకు అవకాశం లేకపోలేదన్నారు. గూడూరు నియోజకవర్గం విభజన విషయంలో ప్రభుత్వం స్పష్టత లేకుండా భిన్న ప్రతిపాదనలను ముందుకు తీసుకురావడం ప్రజల్లో అయోమయాన్ని పెంచుతుందన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని ఒక సారేమో నెల్లూరులో కలుపుతున్నామని, మరో సారేమో తిరుపతిలోనే ఉంటుందని చెప్పడం ఇది దేనికి సంకేతమన్నారు. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ వెలువడిన తరువాతనే అసలు సంగతి బయట పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు కె భక్తవత్సలరెడ్డి, మండల కన్వీనర్ సుధాకర్‌నాయుడు, నాయకులు పాపారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నాగూర్‌రెడ్డి, పెంచలరెడ్డి, మధురెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


