రేపటి నుంచి పాస్ పుస్తకాల పంపిణీ
తిరుపతి అర్బన్: కొత్త పాస్ పుస్తకాలను శుక్రవారం నుంచి ఆయా మండలాల పరిధిలో పంపిణీ చేయా లని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. బుధవారం ఆమె కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాస్ పుస్తకాన్ని ఎంతో జాగ్రత్తగా లబ్ధిదారులకు అందించాలన్నారు. పంపిణీ చేసిన పాస్ పుస్తకాలకు రసీదులు జారీ చేయాలని వెల్లడించారు. పంపిణీలో పారదర్శకత పాటించాలని తెలిపారు. చిన్న పొరబాట్లు చోటుచేసుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. మ్యుటేషన్ వేగవంతం చేయాలన్నారు.
నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా 67,053 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 16,301 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.25 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది.


