నిరుద్యోగ భృతి అందించాలి
రెండేళ్లుగా జిల్లాలోని సుమారు 6 లక్షల మంది నిరుద్యోగులు భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నూతన ఏడాదిలోనైనా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. – సుదర్శన్, ఎమ్మెస్సీ, నిరుద్యోగి, తిరుపతి
లైంగిక దాడులు కట్టడి చేయాలి
నూతన సంవత్సరంలో అయినా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు జరగకుండా ప్రభుత్వం కట్టడి చేయాలి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం మహిళలకు అండగా నిలవాలి.
–సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తిరుపతి
నిరుద్యోగ భృతి అందించాలి


