ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగాలి
నూతన సంవత్సరంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోకుండా ప్రజా స్వామ్య బద్ధంగా పాలన సాగించాలి. అప్రజా స్వా మ్య బద్ధంగా పాలన సాగి స్తే ప్రభుత్వ వ్యతిరేకత తప్పదు. 2026 నూతన ఏడాదిలో ప్రభుత్వం తమ పద్ధతిని మార్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. – అశోక్,
రాష్ట్ర వర్సిటీల కో–కన్వీనర్, ఎస్‌ఎఫ్‌ఐ, తిరుపతి
ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కొత్త సంవత్సరంలోనైనా బాబు ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు అందించాలి. నూతన సంవత్సరంలో మా లాంటి పేదలను ప్ర భుత్వం కనికరించి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు చేయూతనివ్వాలి. – నాగరత్నమ్మ, గృహిణి, తిరుపతి రూరల్
ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయాలి
గత రెండేళ్ల నుంచి ఆరోగ్య శ్రీ సక్రమంగా అమలు కా వడం లేదు. నూతన సంవత్సరంలోనైనా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం పకడ్బందీగా అ మలు చేసి మా లాంటి పేదలకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నాం.
– చెన్నయ్య, వృద్ధుడు, చంద్రగిరి
బెల్టు షాపులను కట్టడి చేయాలి
పచ్చని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రతి పల్లెలో బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నా యి. నూతన ఏడాదిలోనైనా ప్రభుత్వం పల్లెల్లో బెల్టు షా పులను నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలి.
– నారాయణమ్మ, రైతు కూలీ, తిరుపతి రూరల్
పర్యావరణాన్ని సంరక్షించాలి
గుట్టలు, వృక్షాలను కూ ల్చి పర్వావరణాన్ని సర్వనాశనం చేస్తున్న భూభకాసురులపై చర్యలు తీసు కోవాలి. పర్యావరణాన్ని సంరక్షించాల్సి ఉంది.
– సుధీర్ కుమార్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతి
ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగాలి
ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగాలి
ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగాలి
ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగాలి


