గిట్టుబాటు ధర ఇవ్వాలి
గత ఏడాది మామిడి రైతు లందరం పూర్తిగా నష్టపోయాం. కంపెనీలు సైతం ఇ ప్పటివరకు గత ఏడాది రై తులకు ఇవ్వాల్సిన మొత్తం పూర్తిగా అందించలేదు. 2026వ సంవత్సరంలోనైనా మామిడికి ప్రభుత్వ గిట్టుబాటు కల్పించి రైతులను ఆదుకుంటుందని ఆశిస్తున్నాం. –కే మహేందర్‌రెడ్డి,
మామిడి రైతు, రామచంద్రాపురం మండలం
రైతుకు అండగా నిలవాలి
ప్రభుత్వం కొత్త ఏడాదిలో రైతుకు అండగా నిలవాలి. గత రెండేళ్లుగా రైతు చితికిపోయాడు. 2026వ సంవ త్సరంలోనైనా పథకాలన్నీ అమలు చేయాలి. గిట్టుబాటు ధర కల్పించాలి. – మల్లికార్జునరెడ్డి,
రైతు సంఘం అధ్యక్షుడు, సత్యవేడు
పాఠశాల్లో అభివృద్ధి కొనసాగాలి
రెండేళ్లుగా నిధుల కొరత తో మా పాఠశాలలో నూత న తరగతి గదుల నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. ఈ ఏడాదిలోనైనా ప్ర భుత్వం నిధులు విడుదల చే సి పాఠశాలలో ఆగిపోయిన మరమ్మతు, సుందరీకరణ, పలు అభివృద్ధి పనులను కొనసాగించాలని ఆశిస్తున్నా. –కిరణ్,
తొమ్మిదో తరగతి విద్యార్థి, తిరుపతి
గిట్టుబాటు ధర ఇవ్వాలి
గిట్టుబాటు ధర ఇవ్వాలి


