రైతు బతుకు మారాలి
గత రెండేళ్లుగా రైతు విలవిలలాడిపోయాడు. సకాలంలో వరి పంటకు యూరియా దొరక్క నరకం అనుభవించారు. ఈ నూతన సంవత్సరంలోనైనా మా బతుకులు మారాలి. ప్రభు త్వం సకాలంలో ఎరువులు, సబ్సిడీతో విత్తనాలు, అన్నదాత సుఖీభవ అందిస్తుందని ఆశిస్తూ ఆశగా ఎదురు చూస్తున్నాం.
– కావలి రమణయ్య, రైతు, గొల్లపాళెం, వాకాడు
ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలి
జిల్లాలో సుమారు 2,458 మంది విద్యార్థుల నీట్‌లో అర్హత సాధించి ఎంబీబీఎస్ సీటు పక్కాగా వస్తుందని కలలు కన్నారు. కానీ ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుపరం చేయడంతో మా ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం మనస్సు మార్చుకుని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలి. – సాయి చరిత, వైద్య విద్యార్థి, తిరుపతి
రైతు బతుకు మారాలి


