భక్తులకు ఎస్వీబీసీలో హెచ్‌డీ క్వాలిటీతో ప్రసారాలు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఎస్వీబీసీలో హెచ్‌డీ క్వాలిటీతో ప్రసారాలు

Dec 23 2025 6:48 AM | Updated on Dec 23 2025 6:48 AM

భక్తులకు ఎస్వీబీసీలో హెచ్‌డీ క్వాలిటీతో ప్రసారాలు

భక్తులకు ఎస్వీబీసీలో హెచ్‌డీ క్వాలిటీతో ప్రసారాలు

● టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కై ంకర్యాలను హెచ్‌డీ చానల్‌ క్వాలిటీతో ఎస్వీబీసీ చానల్‌ ద్వారా ప్రసారాలను అందించాలని టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్వీబీసీ హెచ్‌డీ చానల్‌ అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్‌ కోసం అదనపు ఉపగ్రహ బ్యాండ్‌ విడ్త్‌ కేటాయింపునకు దరఖాస్తులు చేయాలని సూచించారు. ఎస్వీబీసీ చానల్‌లో ఇప్పటివరకు గంటకు స్పాన్సర్డ్‌ స్పాట్‌లు 12 సెకన్లను 60 సెకన్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు స్విమ్స్‌లో సాధారణ వైద్యచికిత్సలు, అరవింద్‌ ఐ ఆస్పత్రిలో కంటి వైద్యచికిత్సల కోసం మరో రెండేళ్లపాటు క్రెడిట్‌ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్వీబీసీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అవాద్‌ బిన్‌ మొహ్సిన్‌ సనాజీ, ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఎం డీ ఖైసర్‌ పాషాలు వారి రికార్డుల్లో ఇతర అన్యమతస్తులుగా నమోదైనందున వారి కాంట్రాక్ట్‌ గడువు 31.12.2025తో ముగిసిన అనంతరం వారి సేవలను కొనసాగించవద్దని సూచించారు. ఎస్వీబీసీ బోర్డు సభ్యులు ఆనందసాయి, ఎంఎస్‌ రాజులు వర్చువల్‌గా పాల్గొనగా, ఎస్వీబీసీ ఇన్‌చార్జి సీఈఓ డి.ఫణికుమార్‌ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement