కోడి పందేల స్థావరాలపై దాడులు
సైదాపురం: మండలంలోని పెరుమాళ్లపాడు శివారులో గురువారం కోడి పందేల స్థావరాలపై ఎస్‌ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3320 నగదుతోపాటు ఒక కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వారిపై కేసును నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నా భార్యను కిడ్నాప్ చేశారు!
సైదాపురం: తాను ప్రేమించి వివాహం చేసుకున్న తన భార్యను ఆమె బంధువులు తనపై నిర్థాక్షిణ్యంగా దాడి చేసి, కిడ్నాప్ చేశారని సైదాపురం మండలంలోని కుంటిరాజుపాళెం గ్రామానికి చెందిన మందపాటి శివశంకర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం మేరకు.. మండలంలోని కుంటిరాజుపాళెం గ్రామానికి చెందిన మందపాటి శివశంకర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కందుకూరు మండలానికి చెందిన మైత్రి అనే యువతి బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోనే ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న సమయంలో ఇరువురు ప్రేమించుకున్నారు. ఈనెల 15వ తేదీ హైదరాబాద్‌లోనే వివాహం చేసుకుని, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇద్దరం కలిసి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ విషయమై పోలీసుస్టేషన్‌కు పిలిచి ఇరువురి పెద్దల సమక్షంలో రాజీ చేసి పంపేశారు. అయితే గురువారం సెలవు దినం కావడంతో శివశంకర్ తన భార్య మైత్రితో కలిసి స్వగ్రామం నుంచి బైక్‌పై గూడూరుకు వస్తుండగా తమ భార్య బంధువులు కర్రలతో దాడి చేసి, తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకునిపోయారని భాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
60 సవర్ల బంగారం, రూ1.50 లక్షల నగదు చోరీ
వెంకటగిరి రూరల్: కుమార్తె ఉన్నత చదువులు కోసం ఇంట్లో దాచి ఉంచిన నగదు, బంగారం ఎవరు లేని సమయం చూసి దుండగలు చోరీ చేశారు. ఈ ఘటన పట్టణంలోని తోలిమిట్టలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు..తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణమూర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తె ప్రస్తుతం తిరుపతిలో విద్యనభ్యసిస్తూ అక్కడే ఉంది. కుమార్తె బాబోగులు చూసుకునేందుకు బుధవారం తిరుపతికి వెళ్లిన కృష్ణమూర్తి గురువారం ఇంటికి వచ్చి చూసేసరికే గుర్తు తెలియని దుండగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా చేసి ఉన్నారు. అనుమానంతో తాను దాచి ఉంచిన బంగారం, నగదును చూడగా కనిపించలేదు. బాధితుడు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించాడు. స్థానిక ఎస్‌ఐ ఏడుకొండలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, క్లూస్‌టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నట్లు తెలిపారు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు 60 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముట్టెంబాకలో వ్యవసాయ మోటార్ల చోరీ
వాకాడు: మండలంలో ని ముట్టెంబాక గ్రామంలో మూడు రోజులుగా పలువురు రైతులకు చెందిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు వరుస చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు విక్రమ్, శ్రావణ్, నారాయణ గురువారం వాకాడు పోలీస్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వ్యవసాయ మోటార్లను కోట క్రాస్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి ఆటోలో దించుతుండగా బాధిత రైతు ఒకరు గమనించి కోట పోలీసులకు సమాచారం అందిచాడు. వెంటనే స్పందించిన కోట ఎస్‌ఐ పవన్‌కుమార్ అక్కడకి చేరుకుని మోటార్‌తోపాటు ఆటో, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరుసగా మూడు రోజులు 3 మోటార్లు చోరీకి గురి కావడంతో చుట్టుపక్కల రైతులు భయాందోళన చెందుతున్నారు.
కోడి పందేల స్థావరాలపై దాడులు
కోడి పందేల స్థావరాలపై దాడులు
కోడి పందేల స్థావరాలపై దాడులు


