సీఎం పర్యటనలో అప్రమత్తంగా ఉండండి
తిరుపతి తుడా: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొననున్న సంస్కృత వర్సిటీ, జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఏర్పాట్లలో ముఖ్యమంత్రి వెళ్లే మార్గాల్లో పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు లేకుండా పూడ్చాలని, డివెడర్లకు రంగులు వేయాలని తెలిపారు. డివెడర్ల మధ్యలో మొక్కలు ఏర్పాటు చేయాలని, రోడ్లపైన మట్టి లేకుండా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉండాలని హెల్త్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో కేటాయించిన విధులను వారు అప్రమత్తంగా, బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, డీఈలు, శానిటరీ సూపర్ వైజర్లు ఉన్నారు.


