స్మార్ట్ మీటర్లను లోకేష్ పగలగొట్టమన్నారు
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు అమర్చితే వాటిని పగలగొట్టమని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారే స్మార్ట్ మీటర్లు అమర్చడం ఎంత వరకు న్యాయం. అధికారంలో ఉంటే ఒక మాట.. అధికారం లేకుంటే మరో మాట చెప్పడం సరికాదు. మాకు స్మార్ట్ మీటర్లు వద్దు. పాత మీటర్లు మాత్రమే కావాలి. –కోమల, మారుతి నగర్, తిరుపతి
స్మార్ట్ మీటర్ల అమరిక ఆపివేయండి
ప్రజలపై తీవ్రమైన భారాన్ని మోపి...బడా వ్యాపారి ఆదానీకి లాభాలు చేకూర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా స్మార్ట్ మీటర్లు అమర్చితే ప్రతిఘటన తప్పదు. కార్పొరేట్ లాభాల కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం సరికాదు. స్మార్ట్ మీటర్ల అమర్చడాన్ని తక్షణమే ఆపివేయాలి.
– వేణుగోపాల్, సీపీఎం తిరుపతి నగర కార్యదర్శి
స్మార్ట్ మీటర్లను లోకేష్ పగలగొట్టమన్నారు


