క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు

Dec 25 2025 6:17 AM | Updated on Dec 25 2025 6:17 AM

క్రైస

క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు

పుంగనూరు : క్రిస్మస్‌ను పురస్కరించుకుని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి విడివిడిగా శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో కలసి సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు

శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వర ఆలయంలో హుండీల ద్వారా రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. దేవస్థానం ఈఓ బాపిరెడ్డి, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఫణీంద్ర ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. 19 రోజుల వ్యవధిలో రూ.1.31 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే భక్తులు 25.300 గ్రాముల బంగారం, 352.17 కిలోల వెండి కానుకలుగా సమర్పించారన్నారు. విదేశీ కరెన్సీ అమెరికా 31 డాలర్లు, మలేషియా 13, సింగపూర్‌ 3, యూఏఈ 2, దిర్హమ్‌లు. ఇంగ్లాండ్‌ 2, కెనడా 2 డాలర్లు వచ్చినట్లు తెలిపారు.

బ్రహ్మర్షి ఆశ్రమంలో

మారిషష్‌ మంత్రి

రామచంద్రాపురం: మండలంలోని సి.రామాపు రం సమీపంలో శ్రీబ్రహ్మర్షి గురూజీ ఆశ్రమాన్ని బుధవారం మారిషస్‌ విద్యాశాఖ మంత్రి గంగా ప్రసాద్‌మొహద్‌ సందర్శించారు. ఆశ్రమంలో జ రుగుతున్న శ్రీఅష్టలక్ష్మి మహాయజ్ఞంలో పాల్గొ ని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మర్షి గురూజీ గురువాయనంద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆశ్రమ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి బ్రహ్మశ్రీ గురుజీ పుస్తకాన్ని అందజేశారు.

శ్రీవారి దర్శనానికి 16 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ ఏటీజీహెచ్‌ వద్దకు చేరుకుంది. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

ఎంపీ పెద్దిరెడ్డి

వెంకటమిథున్‌రెడ్డి

మాజీ మంత్రి డాక్టర్‌

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
1
1/3

క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు

క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
2
2/3

క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు

క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
3
3/3

క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement