ఇసుక ఉచితం.. దోపిడీ నిజం | - | Sakshi
Sakshi News home page

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం

Dec 25 2025 6:17 AM | Updated on Dec 25 2025 6:17 AM

ఇసుక

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం

స్వర్ణముఖి నుంచి ఇష్టారాజ్యంగా

ఇసుక అక్రమ రవాణా

పొర్లుకట్టలు ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు

ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళుతూ..

ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచి పెడుతున్న వాహక నౌక

నాయుడుపేటటౌన్‌: ఇసుక ఉచితం పేరుతో అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. స్వర్ణముఖి నదిని ఇసుకాసురులు ధ్వంసం చేస్తున్నారు. నదిలో అక్రమంగా ఇసుక తరలించకూడదని, ఇందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇసుకస్మగర్లు ఆ ఆదేశాలను బేఖాతార్‌ చేస్తున్నారు. మండలంలోని అయ్యప్పరెడ్డిపాళెం వద్ద ఉన్న స్వర్ణముఖి నది నుంచి రోజు తమిళనాడుకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో రహస్య ప్రదేశాల్లో ఇసుక డంపింగ్‌ చేసుకుని, దర్జాగా టిప్పర్లలో తమిళనాడు ప్రాంతానికి తరలిస్తున్నారు. అంతే కాకుండా నాయుడుపేట పట్టణ పరిధిలోని ఏల్‌ఏ సాగరం, బీడీ కాలనీ, మర్లపల్లి, అన్నమేడు, కల్లిపేడు, మూర్తిరెడ్డిపాళెం, భీమవరం తదితర గ్రామాల్లో చాలాచోట్ల ట్రాక్టర్లు, టిప్పర్లు రాకపోకలు సాగించేలా స్వర్ణముఖి నది పొర్లు కట్టలను సైతం ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమంగా తరలింపు యథేచ్ఛగా సాగిస్తున్నారు. నదిలో నీరు ప్రవహిస్తున్నా ఇసుకను తరలిస్తున్నారు. ఇంటి అవపసరాల పేరుతో అధికంగా పరిశ్రమలతోపాటు కాంక్రీట్‌ మిక్చర్‌ ప్లాంట్లు, డంపింగ్‌ యార్డులకు ఇసుకను తరలించి, అధిక ధరలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని చిగురుపాడు, మర్లపల్లి, అయ్యప్పరెడ్డిపాళెం తదితర గ్రామాల్లో ఇదెక్కడి అన్యాయమని అడుగుతున్న గ్రామస్తులపై అక్రమార్కులు దౌర్జ్యనానికి దిగుతున్నారు. నది పొర్లుకట్టలను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో వారి తీరుపై ప్రజలు బాహటంగా విమర్శిస్తున్నారు. చిగురుపాడు సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇటీవల ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు నది వద్ద అడ్డుకట్టలు వేసినా వాటిని తొలగించి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని పండ్లూరు పలు ప్రాంతాల్లో ఇసుకను డంపింగ్‌ చేసుకుని రాత్రి సమయాల్లో టిప్పర్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు. టిప్పర్లకే కాకుండా తడ ప్రాంతానికి చెందిన కొంత మంది ఇసుక స్మగర్లు నాయుడుపేటకు వచ్చి ట్రాక్టర్లలో తమిళనాడు సరిహద్దు వరకు ఇసుకను తరలిస్తున్నారు.

నాయుడుపేట నుంచి తమిళనాడు ఇసుక తరలిస్తున్న టిప్పర్లు

అయ్యప్పరెడ్డిపాళెం సమీపంలో ఇసుక అక్రమ తరలింపు

ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలి

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: వచ్చే నెలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయా లని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వీసీ హాలులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

నాయుడుపేటలోని స్వర్ణముఖి ఇసుక వ్యాపారులకు వరంగా మారింది. సామాన్యుల ఇళ్ల అవసరాలకు ఉచితంగా ఇసుక తరలించుకోవచ్చన్న ప్రభుత్వ నిబంధనను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నిత్యం అధిక సంఖ్యలో టిప్పర్లలో తమిళనాడుకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు.

అయ్యప్పరెడ్డిపాళెం టూ తమిళనాడు

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం1
1/6

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం2
2/6

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం3
3/6

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం4
4/6

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం5
5/6

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం6
6/6

ఇసుక ఉచితం.. దోపిడీ నిజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement