ఆదానీ, అంబానీ స్మార్ట్ మీటర్లు మాకొద్దు
ఆదానీ, అంబానీకి చెందిన ప్రైవేటు స్మార్ట్ మీటర్లు మాకొద్దు. 400 విలువ చేసే స్మార్ట్ మీటర్లకు 90 నెలల వ్యవధిలో ఒక్కో మీటర్ నుంచి రూ.8 వేలు వసూలు చేస్తారు. సామాన్యులు మీటర్లకు రీచార్జి చేయించుకోవడం సులభం కాదు. ఇప్పటికే కొన్ని స్మార్ట్ మీటర్లు అమర్చారు. వాటిని సైతం తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.
–రాజు, సీపీఎం కార్యదర్శి, మారుతీనగర్, తిరుపతి
అభ్యంతరాలు వస్తున్నాయి!
మారుతీనగర్‌లో స్మార్ట్ మీటర్లపై అభ్యంతరాలు చోటుచేసుకుంటున్నాయి. సిబ్బందితో వాగ్వావాదా లు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో స్మార్ట్ మీటర్లతో పలు ఇబ్బందులు వస్తాయని తెలుస్తోంది. ఏమీ చెప్పకుండా ఇలా స్మార్ట్ మీటర్లు అమర్చడం న్యాయం కాదు. ఈ అంశంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించాం. – తంబాల గోవింద్, టీడీపీ తిరుపతి నగర అధికార ప్రతినిధి
ఆదానీ, అంబానీ స్మార్ట్ మీటర్లు మాకొద్దు


