స్టార్టర్లు, మోటార్లు చోరీ
తిరుపతి రూరల్: మండలంలోని కుంట్రపాకం పంచాయతీ పరిధిలోని పొలాల్లో మంగళవారం రాత్రి 5 చోట్ల స్టార్టర్లు, విద్యుత్ వైర్లు, మోటార్లు చోరీ చేశారు. చోరీకి గురైన స్టార్టర్లు, మోటార్లు, వైర్లు సుమారు రూ.1.50 లక్షల చేస్తాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చోరీకి సిమెంటు బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద సీసీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తి సమీపంలోని భాగ్యనగరం ఎస్టీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
తిరుపతి రూరల్: మండలంలోని ఓటేరు పంచాయతీ రామకృష్ణనగర్‌లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కథనం మేరకు.. రామకృష్ణనగర్‌కు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు తన ఇంటి నుంచి బయటకు వెళ్లి, 2.40 గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటి తలుపు గడియ విరిచి లోపల దాచిన రూ. 1.38 లక్షల నగదు, 8.50 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకువెళ్లారు. ఈ మేరకు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుపతిలోని సంజయగాంధీ కాలనీకి చెందిన బద్దనల హరి గా గుర్తించి, బుధవారం తనపల్లి కూడలిలో అరె స్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నగ దు ఖర్చు చేసేయడం, బంగారు ఆభరణాలను ఓ మహిళకు ఇచ్చినట్టుగా నిందితుడు పోలీసులకు తెలిపారు. నిందితుడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించినట్టు సీఐ చిన్న గోవిందు తెలిపారు. కేసు చేధించిన ఎస్‌ఐ, ఐడీపార్టీ సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్, సీఐ చిన్న గోవిందు అభినందించారు.
ఆకట్టుకున్న బాలఏసుతో మరియమ్మ సైకత శిల్పం
చిల్లకూరు: తీర ప్రాంతంలోని ఏరూరు గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్ తనదైన శైలిలో బుధవారం సెయింట్ జాన్స్ లూథరన్ చర్చి ఆవరణలో బాలఏసుతో ఉన్న మరియమ్మ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఏసు క్రీస్తు ప్రభువు జన్మ స్థలం ఒక పశువుల పాకగా ఉండడంతో దానిని ఆధారం చేసుకుని సైకతశిల్పి పొత్తిగుడ్డలో ఉన్న బాల ఏసును తల్లి మరియమ్మ ఎత్తుకుని తన్మయత్వంతో ఉన్నట్లు సైకత శిల్పాన్ని రూపొందించడంతో పలువురిని ఆకట్టుకుంది.
విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో ఆర్మేనిపాడు విద్యార్థుల ప్రతిభ
ఓజిలి: బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో ఆర్మేనిపాడు విద్యార్థులు ప్రదర్శించిన ఎకో ఫ్రెండ్లీ ఫ్లోర్‌క్లీనర్ జాతీయ స్థాయికి ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎం నరేంద్ర, సైన్స్ ఉపాధ్యాయుడు సురేంద్రరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సురేంద్రరెడ్డి మండలస్థా యి విద్యవైజ్ఞానిక మేళాలో ఆర్మేనిపాడు ఉన్నత పాఠశాల ఆరో తరగతి చదువుతున్న అవంతిక, వసిదాలు తయారు చేసిన ప్రదర్శన జిల్లా పోటీలకు ఎంపికై ంది. జిల్లా స్థాయి విద్యవైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ప్రదర్శన ఉత్తమ ప్రతిభ కనబరడంతో జిల్లా అధికారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అనంతరం ఈ నెల 23, 24న విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మేళాలో గ్రూప్ 1 విభాగంలో అత్యంత ఉత్తమ ప్రతిభను కనబరచడంతో రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి విద్య,వైజ్ఞానిక ఎంపికై ందని సైన్స్ ఉపాధ్యాయుడు సురేంద్రరెడ్డి తెలిపారు.
స్టార్టర్లు, మోటార్లు చోరీ
స్టార్టర్లు, మోటార్లు చోరీ
స్టార్టర్లు, మోటార్లు చోరీ
స్టార్టర్లు, మోటార్లు చోరీ


