రాష్ట్రపతికి సాదర వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల ప ర్యటన ముగించుకుని శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి సాదర వీడ్కోలు పలి కారు. వీడ్కోలు పలికిన వారిలో రాష్ట్ర హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డీఐజీ షిమోషి బాజ్ పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితర అధికారులు ఉన్నారు.
విధులకు హాజరు కాని టీచర్లపై చర్యలు
తిరుపతి సిటీ: అధికారులకు ఎటువంటి సమా చారం ఇవ్వకుండా సుధీర్ఘకాలం విధులకు హా జరు కాని జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటా మని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. శ్రీకాళహస్తి మండలం కేపీమి ట్ట ఎంపీపీఎస్ పాఠశాలల్లో ఎస్‌జీటీగా పని చే స్తున్న ఎస్ మధు గత జూన్ 16వ తేదీ నుంచి విధులకు హాజరుకావడం లేదని, మూడు రో జుల్లోపు ఎంఈఓని కలిసి సంజాయిషీ ఇవ్వాల ని తెలిపారు. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆ ప్రకటనలో హెచ్చరించారు. అ లాగే దొరవారిసత్రం మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ విశ్వనాథ్ గత ఏడాది మార్చి 29వ తేదీ నుంచి విధులకు హా జరుకావడం లేదని, అలాగే ఓజిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం సుమన కుమారి గత ఏడాది డిసెంబర్ నుంచి విధులకు హాజరు కావడం లేదని వెంటనే విధులకు హాజరుకాని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పని ఆయన హెచ్చరించారు.
మార్చి 16 నుంచి పది పరీక్షలు
తిరుపతి సిటీ: బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శుక్రవారం పది పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు ఎస్‌ఎస్‌ఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అ లాగే ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఒకేషనల్ కో ర్సుకు సంబంధించి పరీక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షల కాలవ్యవధిగా నిర్ణయించారు. 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెంకడ్ లాంగ్వేజ్, 23న గణితం, 25న ఫి జికల్ సైన్స్, 28న బయాలజీ, 30న సోషియల్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు. 31వ తేదీన మెయిన్ లాంగ్వేజ్ ఎంపిక చేసుకున్న విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్షలతోపాటు ఏప్రిల్ ఒకటో తేదీన ఎస్‌ఎస్‌ఎస్సీ ఒకేషనల్ కోర్సు తీసుకున్న విద్యార్థులకు థి యరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం తిరుపతి వారికి 3 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం రాయితీతో ఇస్తామని, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ వె ల్ఫేర్ జిల్లా అధికారి విక్రంకుమార్‌రెడ్డి శుక్రవా రం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం ద్వారా మంజూరు చేస్తామని చెప్పారు. రూ.31,67,326 విలువ చేసే వాహనానికి రూ.14,16,831 రాయితీ ఉంటుందన్నారు. మిగిలిన మొత్తానికి ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ రుణం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వ రకు షెడ్యూల్ కులముల వారు దరఖాస్తులు చే సుకునే సౌలభ్యం ఉందని చెప్పారు. దరఖాస్తు చేసుకునే వ్యక్తి తిరుపతికి చెందిన వారుగా ఉండాలని, సఫాయి కర్మచారి వృతిలో ఉండాలని, వాహనం ఐదుగురు సభ్యుల గ్రూపునకు ఇస్తామన్నారు. అందులో ఒకరికి ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి, రాయితీ మినహా మిగిలిన మొత్తాన్ని 72 నెలల్లో చెల్లించాలన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువా రం అర్ధరాత్రి వరకు 66,839 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 19,220 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూ పంలో హుండీలో రూ.4.61 కోట్లు సమర్పించా రు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తు లకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్ర త్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.


