కొలిచి.. తరించి
స్వర్ణరథంపై ఊరేగుతున్న సౌభాగ్యలక్ష్మి
తిరుచానూరులో అంగరంగ వైభవంగా సాగుతున్న పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోరోజు శనివారం వివిధ వాహనాలపై విహరించిన అమ్మవారిని అశేష భక్తజనులు వీక్షించి తన్మయత్వం చెందారు. తొలుత దర్బార్ శ్రీకృష్ణుని అలంకారంలో సర్వభూపాల వాహనంపై కొలువుదీరి సర్వాంతర్యామిగా దర్శనమిచ్చిన శ్రీవారి దేవేరి దివ్యస్వరూపాన్ని సేవించుకుని పరవశించారు. అనంతరం స్వర్ణరథం అధిరోహించి సౌభాగ్యలక్ష్మిగా తిరువీధుల్లో ఊరేగిన అలమేలు మంగమ్మను కనులారా కాంచి తరించారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో వైకుంఠనాథుని పవిత్ర పాదాలను ధరించి.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడుని అధిష్టించి విహరించిన సిరులతల్లి కరుణా కటాక్షం పొంది పునీతులయ్యారు. తిరుమల చిన్నజీయర్, పెద్దజీయర్‌స్వాములు, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం, సీవీఓస్‌ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– చంద్రగిరి
కొలిచి.. తరించి
కొలిచి.. తరించి
కొలిచి.. తరించి
కొలిచి.. తరించి
కొలిచి.. తరించి


