అభివృద్ధి ప్రస్తావన అభినందనీయం
వాకాడు: కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో వాకాడు మండలంలోని తీర ప్రాంతం అభివృద్ధి పనులను ఎంపీ గురుమూర్తి ప్రస్తావించడం అభినందనీయమని వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి తెలిపారు. అభివృద్ధి కమిటీ సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని, ఈ మేరకు ఎంపీ మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాల్లో త్రీ ఫేస్ కరెంటు ఇవ్వాలని, అలాగే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 3 కోట్లుతో మొనపాళెం, నవాబుపేట మధ్య మంజూరైన గ్రావెల్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారన్నారు. అలాగే పీఎంఏజీవై పథకం ద్వారా మంజూరైన పలు అభివృధ్ది పనులకు వెంటనే శ్రీకారం చుట్టాలని, , గత ప్రభు త్వంలో చేపట్టిన 15 అంగనవాడీ భవనాలను పూర్తి చేయాలని కోరారని వివరించారు.
గుడిమల్లం ఆలయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో
ఏర్పేడు : మండలంలోని గుడిమల్లంలోని ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీఆనందవల్లీ సమేత పరశురామేశ్వరుని ఆలయాన్ని శనివారం విజయవాడకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కె.శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు.
అభివృద్ధి ప్రస్తావన అభినందనీయం


