సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు
● జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్
తిరుపతి మంగళం : వాహనదారులు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వారి లైసెన్స్ రద్దు చేయనున్నట్లు జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు శనివారం తిరుపతి– మంగళం రోడ్డులో సెల్‌ఫోన్ వినియోగిస్తూ ద్విచక్ర వాహనాలు నడపుతున్న వారిపై కేసులు నమోదు చేసి, రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అథికానాజ్, స్వర్ణలత వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ తనిఖీల్లో 22 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు మురళీమోహన్ తెలిపారు. సెల్‌ఫోన్ వినియోగిస్తూ వాహనం నడుపుతున్న పదిమంది, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న మరో పది మంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మోటార్ వాహనాల సెక్షన్ 184 ప్రకారం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేవారికి మొదటిసారిగా రూ.1500, రెండవ సారి అదే వాహనాన్ని వినియోగిస్తూ మొబైల్ డ్రైవింగ్ చేసిన పక్షంలో రూ.10,000 వరకు అపరాధ రుసుము ఉంటుందని తెలియజేశారు. మోటార్ వాహనాల తనిఖీ అధికారి అథికానాజ్ మాట్లాడుతూ మొబైల్ డ్రైవింగ్ చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలల వరకు రద్దు చేయడనికి సిఫారసు చేస్తామని హెచ్చరించారు.
అమరరాజా క్వార్టర్స్‌లో భారీ చోరీ
రేణిగుంట : మండలంలోని కరకంబాడి పంచాయతీలోని అమరరాజా పరిశ్రమ లోని ఉద్యోగుల క్వార్టర్స్‌లో శనివారం తెల్లవారుజామున ఏడు ఇళ్లలో చోరీ జరిగిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. అమరరాజా క్వార్టర్స్‌లో దొంగతనం జరిగినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ సీఐ జయచంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడు ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నించగా నాలుగు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. 450 గ్రాముల బంగారం, మూడు కేజీల వెండిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి, క్రైమ్ డీఎస్పీ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు క్వార్టర్స్‌కు చేరుకొని క్షుణం గా పరిశీలించి సాక్షాలను సేకరిస్తున్నారు. అత్యంత భద్రత కలిగిన క్వార్టర్స్ లో దొంగతనం జరగడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి దొంగలను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.
ఎంబీయూలో 50 వసంతాల సంబరాలు
చంద్రగిరి : ఏ.రంగంపేట సమీపంలోని మోహన్‌బాబు యూనివర్శిటీ (ఎంబీయూ)లో 50 వసంతాల సంబరాలను యూనివర్సిటీ అధికారులు ఘనంగా జరుపుకున్నారు. సినీ పరిశ్రమలో మోహన్‌బాబు 50 సంవత్సరాలను పూర్తి చేసుకోవడంతో శనివారం ఎం బ్లాక్ వద్ద వీసీ నాగరాజ్ రామారావ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులు మోహన్‌బాబు సినిమాలకు చెందిన పాటలకు స్టెప్పులేస్తూ హోరెత్తించారు. సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిలో ఆయన అరుదైన వ్యక్తిగా నిలిచారని తెలిపారు. అదే విధంగా ఏ.రంగంపేట కూడలి వద్ద అభిమానులు భారీ కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సారధి, డీఎఫే రవిశేఖర్, జీఎం, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీలకు గోవర్ధనపురం విద్యార్థులు
వరదయ్యపాళెం : మండలంలోని గోవర్ధనపురం హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే అండర్–14 విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ ముద్దుకృష్ణ తెలిపారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి దినేష్ అండర్–14 వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాగా ఆయన చిత్తూరు జిల్లా టీమ్ నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మోహిద్దీన్, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
ప్రపంచ రికార్డు టాలెంట్ షోలో పేట విద్యార్థులు
నాయుడుపేటటౌన్ : చైన్నెలో శనివారం రాత్రి జరిగిన ప్రపంచ రికార్డు టాలెంట్ షోలో నాయుడుపేటకు చెందిన జీడీ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన అనేక మంది విద్యార్థులకు పలు విభాగాలలో పాల్గొంటున్నట్లు జీడీ మాస్టర్ తెలిపారు. తమ డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 17 మంది విద్యార్థులు భరతనాట్యం, తదితర విభాగాలో పాల్గొన్నట్లు వివరించారు.
సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు
సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు
సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు
సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు
సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు


