టాస్క్‌ఫోర్స్ అదనపు ఎస్పీగా కులశేఖర్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ అదనపు ఎస్పీగా జె.కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన తిరుపతి ఏఎస్పీ (శాంతి భద్రతలు)గా పని చేశారు. ఆయన్ను టాస్క్‌ఫోర్స్‌కు అటాచ్ చేయడంతో ఎస్పీ ఎల్.సుబ్బరాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు.
అండర్– 14 హాకీ టోర్నీ ప్రారంభం
చంద్రగిరి : స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి అండర్–14 బాల, బాలికల హాకీ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నానితో పాటు జాతీయ హాకీ క్రీడాకారిణి రజని ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ జిల్లా ఫ్లకార్డులతో ముందుకు సాగారు. అనంతరం హాకీ క్రీడాకారిణి రజనీతో కలసి ఆయన టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా , మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


